ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Illigal Arrest : ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు రెండేళ్లు

ABN, Publish Date - Sep 09 , 2025 | 11:22 AM

సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి రెండేళ్లు అయింది. 2023 సెప్టెంబర్ 9న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును లేని కుంభకోణాన్ని సృష్టించి గత వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి రెండేళ్లు అయింది. 2023 సెప్టెంబర్ 9న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును లేని కుంభకోణాన్ని సృష్టించి గత వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నిలువెల్లా అవినీతి కూపంలో కూరుకుపోయి అవినీతి, అక్రమార్జన కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న నాటి సీఎం జగన్.. ఆ అవినీతి మరకలను చంద్రబాబుకు కూడా అంటిచేందుకు చేసిన దుస్సాహసమే స్కిల్ డెవలప్‌మెంట్ కేసు. నంద్యాలో సెప్టెంబర్ 8న బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం తన బస్సులో సేద తీరేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటి సీఐడీ డీఐజీ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలోని పోలీస్ బృందం.. చంద్రబాబు బస్సు వద్ద రాత్రంతా హడావుడి చేసి, 9వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకు అక్రమ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ ర్యాంక్‌లో ఉన్న చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు 400 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

Updated Date - Sep 09 , 2025 | 11:22 AM