Kashmir Landslide: ఇక్కడేమో ఎండలు..అక్కడేమో వర్షాలకు విరిగిపడ్డ కొండలు, వందకుపైగా.
ABN, Publish Date - Apr 20 , 2025 | 06:29 PM
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. కానీ ఇదే సమయంలో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందగా, వంద మందికిపైగా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో (Jammu Kashmir Landslides) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం రాంబన్ జిల్లాలో కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరికొంత మంది కొండ చరియల్లో చిక్కుకున్నారు. దీంతోపాటు అనేక ఇళ్లు, దుకాణాలు చరియల ధాటికి కూలిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షం కారణంగా అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Updated Date - Apr 20 , 2025 | 06:29 PM