Cyber Fraud: శ్రీశైలం భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు
ABN, Publish Date - Nov 25 , 2025 | 08:50 AM
శ్రీశైలం మల్లన్న భక్తులను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ఫేక్ వెబ్ సైట్ పెట్టి.. వసతి గదుల పేరుతో భారీగా డబ్బులను కాజేశారు.
నంద్యాల జిల్లా, నవంబర్ 25: శ్రీశైలం మల్లన్న భక్తులను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ఫేక్ వెబ్ సైట్ పెట్టి.. వసతి గదుల పేరుతో భక్తులను బురిడీ కొట్టించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు వేగంగా చేస్తున్నారు. దేవస్థానం పరిధిలో వసతి కల్పిస్తామంటూ జస్ట్ డయల్ యాప్ పేరుతో కేటుగాళ్లు ఈ మోసానికి పాల్పడ్డారు. ఏపీ టూరిజం పేరుతో నకిలీ వెబ్ సైట్ పెట్టి.. భక్తుల నుంచి భారీగా డబ్బులు దోచుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ శ్రీశైలంలో ఏపీ టూరిజంకు చెందిన హరిత గెస్ట్ హౌస్ లో రూమ్ ను బుక్ చేసుకున్నారు. ఆన్ లైన్ లో రూ.30 వేలు చెల్లించారు. ఆయన శ్రీశైలం వచ్చి సదరు గెస్ట్ హౌస్ లో రశీదు చూపించగా.. ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
ఇవీ చదవండి:
బాలుడిపై శునకం దాడి.. తెగిపడిన చెవి
దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..
Updated Date - Nov 25 , 2025 | 10:32 AM