సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో భేటీ
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:53 PM
CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశమయ్యారు. విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దేలా ప్రణాళిక అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు.
అమరావతి, జూన్ 6: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (CM Chandrababu Naidu) నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం (NITI Aayog CEO Subrahmanyam) భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాల గురించి చర్చించారు. ఎనిమిది జిల్లాలతో విశాఖ ఎకానమిక్ రీజియన్ (Visakhapatnam Economic Region) ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎకానమిక్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మూలపేట- కాకినాడ మధ్య బీచ్ రహదారి అభివృద్ధి చేస్తామన్నారు.
విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దేలా ప్రణాళిక అమలు చేస్తామన్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ నేలమట్టం
చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 06 , 2025 | 05:01 PM