CM Chandrababu: అమరావతి భూసేకరణపై సీఎం చంద్రబాబు క్లారిటీ..
ABN, Publish Date - Sep 12 , 2025 | 09:45 PM
హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుందన్నారు. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే ఉన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హైటెక్ సిటీ రాకముందు హైదరాబాద్‌లో.. ఎకరం రూ.లక్ష ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఎకరం రూ.100 కోట్లు అని తెలిపారు. పరిశ్రమలు, అభివృద్ధిని బట్టి భూమి విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి కంటిన్యూగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కథనానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఈ క్రింది వీడియోలో చూడండి.
Updated Date - Sep 12 , 2025 | 09:46 PM