ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు సఫలం
ABN, Publish Date - May 20 , 2025 | 04:57 PM
AP Teachers Unions: ఏపీ ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సచివాలయంలో సమావేశమయ్యారు.
అమరావతి, మే 20: ఉపాధ్యాయ సంఘాలతో (AP Teachers Unions) ఏపీ ప్రభుత్వ (AP Govt) చర్చలు ఫలించాయి. దీంతో ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. సమాంతర మాద్యమం విషయంలో మాత్రం మంత్రి నారా లోకేష్‌తో (Minister Nara lokesh) చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు (మంగళవారం) ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సచివాలయంలో చర్చించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక తరఫున చర్చలు ఫలించినట్లు వారు ప్రకటించారు. ఎస్‌జీటీలకు మాన్యువల్ పద్దతిలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పకుందని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో 49 దాటిన తరువాత 2వసెక్షన్ ఏర్పాటు చేసేందుకు సర్కార్ అంగీకరించింది.
ఫౌండేషన్ పాఠశాలల్లో 20 రోల్ దాటిన తరువాత 2వ పోస్టు ఇస్తామని.. ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ప్రాధమిక పాఠశాలలు విడిగా నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే వర్క్ లోడ్ ఎక్కువయ్యే సందర్భంలో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులకు అవసరం మేరకు అకడమిక్ ఇన్ స్ట్రక్టర్, సర్‌ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Notice To KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
AP Cabinet Meeting: ఎవ్వరూ మాట్లాడొద్దు.. లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్
Read Latest AP News And Telugu News
Updated Date - May 20 , 2025 | 04:57 PM