Notice To KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
ABN , Publish Date - May 20 , 2025 | 01:29 PM
Notice To KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5 లోపు కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
హైదరాబాద్, మే 20: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (Former CM KCR) కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. జూన్ 5 లోపు కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), ఈటల రాజేందర్‌కు (Etela Rajender) కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందజేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం నిర్మాణం వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాదిన్నరగా కమిషన్ విచారణ కొనసాగుతోంది. కమిషన్ విచారణ గడువు ఈ నెలాఖరితో ముగియనుంది. అయితే కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు (జూలై 31) వరకు పొడిగిచింది. కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డీఈలు, ఎస్‌ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్లరూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి.. వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది కమిషన్. ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీల ప్రతినిధులను కూడా విచారించింది.
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
అలాగే ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఈ ఏడాది పాటు సుదీర్ఘంగా జరిపిన ఈ విచారణలో దాదాపు అందరూ కూడా కేసీఆర్ పేరే చెప్పినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపికను ఎవరు చేశారని ప్రశ్నించగా.. ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరునే ప్రస్తావించినట్లు సమాచారం. స్థలాల ఎంపిక, బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రమేయంతో జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు వచ్చిన వివరాలతో ఓ నివేదికను కూడా సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నివేదిక ఇస్తే బీఆర్‌ఎస్ తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని భావించిన కమిషన్.. కేసీఆర్‌ను స్వయంగా విచారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేసీఆర్ సహా హరీష్, ఈటలకు నోటీసులు పంపించింది. జూన్ 5లోపు వీళ్లు కమిషన్ ముందు హాజరై కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ నోటీసుల్లో పేర్కొన్నారు. జూన్ 5 లోపు వాళ్లు ఎంచుకున్న తేదీ అయినా లేదా కమిషన్ నిర్ణయించిన తేదీల్లో విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసులు తెలియజేశారు. అయితే కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేక న్యాయపరంగా ఎదుర్కుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
GHMC: ఆ భవనాల సెల్లార్లు ఎంతవరకు సురక్షితం..
Raj Bhavan Theft Case: రాజ్‌భవన్ చోరీ కేసులో మరో మలుపు
Read Latest Telangana News And Telugu News