GHMC: ఆ భవనాల సెల్లార్లు ఎంతవరకు సురక్షితం..
ABN , Publish Date - May 20 , 2025 | 07:43 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన భవనాల సెల్లార్ల పరిశీలనకు ఆధికారులు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు భవనాల సెల్లార్లను పరిశీలించాలని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో ఇటీవల వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- పరిశీలించాలని కమిషనర్ ఆదేశాలు
- నిబంధనలు పాటించేలా నోటీసుల జారీ
- ఉల్లంఘించిన వారిని ఉపేక్షించం
- అనుమతులు, బిల్డర్ లైసెన్స్ రద్దు
హైదరాబాద్ సిటీ: అకాల వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC) అప్రమత్తమైంది. సెల్లార్ తవ్వకాలతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. వర్షాకాల సన్నాహాక చర్యల్లో భాగంగా కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(Commissioner RV Karnan) సోమవారం పట్టణ ప్రణాళికా విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్..
పురోగతిలో ఉన్న సెల్లార్ తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పక్కనున్న నిర్మాణాలపై ప్రభావం పడకుండా నిబంధనలు పాటించేలా, రిటైనింగ్ వాల్ నిర్మాణం, బారీకేడింగ్ వంటి ముందస్తు చర్యలు తీసుకునేలా చూడాలని పేర్కొన్నారు. ఆయా అంశాలను పేర్కొంటు నోటీసులు జారీ చేయాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటు సెల్లార్ పనులు వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని,
ప్రజల భద్రత దృష్ట్యా.. మాన్‌సూన్‌లో తవ్వకాలపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసినా జాగ్రత్తలు చేపట్టని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. పనులు నిలిపివేయడంతోపాటు భవనం అనుమతి, బిల్డర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ఏటవాలుగా ఉండే, రాళ్లు పగులగొట్టి తవ్వే సెల్లార్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా ప్రాంతాల్లో ఉండే వారిని ఖాళీ చేయించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Rice Production: సస్యశ్యామల భారతం
Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?
Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు
Read Latest Telangana News and National News