ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. 16 తులాల బంగారం మాయం
ABN, Publish Date - Dec 24 , 2025 | 10:14 AM
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కనురెప్ప పాటులో ఆమె బ్యాగ్‌లో ఉన్న సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అనంతపురం నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.
అనంతపురం, డిసెంబర్ 24: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కనురెప్ప పాటులో ఆమె బ్యాగ్‌లో ఉన్న సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అనంతపురం నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. 16 తులాల బంగారు ఆభరణాలతో షబానా అనే మహిళ బస్సు ఎక్కింది. టికెట్ కోసం బ్యాగులో నుంచి ఆధార్ కార్డు తీసుకునే క్రమంలో బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో షాకైన బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అనంతపురం కలెక్టరేట్ వద్ద బస్సుని ఆపిన పోలీసులు ప్రయాణికులను చెక్ చేశారు. పోలీసుల తనిఖీల్లో బంగారు ఆభరణాలు లభించలేదు. దీంతో బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.
Updated Date - Dec 24 , 2025 | 10:14 AM