ఏసీబీకి చిక్కిన TSSPDCL సబ్ ఇంజనీర్
ABN, Publish Date - Oct 10 , 2025 | 09:29 PM
హైదరాబాద్ లాలాగూడలోని విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టీజీఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి రూ. 15 వేల లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు దొరికి పోయారు.
హైదరాబాద్ లాలాగూడలోని విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టీజీఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి రూ. 15 వేల లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు దొరికి పోయారు. మీటర్ అప్ గ్రేడ్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అతడికి రిమాండ్ విధించింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఏపీలో మెడికల్ కాలేజీల గోలేంటి?
How Are You Sir.. బుడ్డోడి ఇంగ్లీష్ కి ఫిదా అయిన సీఎం
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 10 , 2025 | 09:30 PM