ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: భార్య వేధింపులతో యువకుడి ఆత్మహత్య

ABN, Publish Date - Jul 14 , 2025 | 04:39 AM

భార్య, అత్తమామలు, భార్య తరఫు బంధువులతో పాటు సీఐ వేధింపులతోనే చనిపోతున్నానని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

  • సీఐ సహా అయిదుగురిపై కేసు నమోదు

చొప్పదండి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): భార్య, అత్తమామలు, భార్య తరఫు బంధువులతో పాటు సీఐ వేధింపులతోనే చనిపోతున్నానని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో జరిగింది. చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్‌కుమార్‌ (34) కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కరీంనగర్‌కు చెందిన నీలిమతో 2021లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. నీలిమ కరీంనగర్‌ డిపోలో బస్‌ కండక్టర్‌గా పని చేస్తున్నారు. ఏడాదిగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నీలిమ తన భర్త, అత్తమామలు, ఆడపడుచుపై మే నెలలో కరీంనగర్‌ మహిళా పోలీ్‌సస్టేషన్‌లో గృహహింస, వరకట్న వేధింపుల కేసును నమోదు చేసింది.

పోలీసుల దర్యాప్తుతో మనస్తాపానికి గురైన శ్రవణ్‌ ఈనెల 7న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం కరీంనగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. తన మరణానికి సీఐ శ్రీలత కారణమంటూ ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో శ్రవణ్‌కుమార్‌ ఆరోపించాడు. తనపై దొంగ కేసు నమోదు చేశారని, పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా బలవంతంగా విడాకుల పత్రంపై సంతకం పెట్టించారని తెలిపాడు. శ్రావణ్‌ తండ్రి నర్సింగం ఫిర్యాదు మేరకు సీఐ శ్రీలత, శ్రవణ్‌ భార్య నీలిమ, ఆమె తల్లి, ఆమె తరఫున పోలీ్‌సస్టేషన్‌కు వచ్చిన మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

వికసిత్‌ తెలంగాణ బీజేపీకే సాధ్యం

రాజకీయ న్యాయానికి భరోసా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 04:39 AM