Yadagirigutta: ఆహ్లాదగిరి
ABN, Publish Date - Jun 01 , 2025 | 04:19 AM
ఆధ్యాత్మిక వైభవం చెంతనే ఆహ్లాద సోయగం! యాదగిరిగుట్ట క్షేత్రం అతి సమీపంలోని రాయగిరి చెరువు వద్ద రెండెకరాల్లో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేలా మినీ శిల్పారామం రూపుదిద్దుకుంది.
యాదగిరి క్షేత్రంలో రూపుదిద్దుకున్న మినీ శిల్పారామం
రేపటి నుంచే పర్యాటకులకు అందుబాటులోకి
ప్రారంభించనున్న మంత్రులు జూపల్లి, కోమటిరెడ్డి
రాయగిరి చెరువు పక్కనే 2 ఎకరాల్లో ఆకట్టుకునే నిర్మాణం
యాదాద్రి, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక వైభవం చెంతనే ఆహ్లాద సోయగం! యాదగిరిగుట్ట క్షేత్రం అతి సమీపంలోని రాయగిరి చెరువు వద్ద రెండెకరాల్లో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేలా మినీ శిల్పారామం రూపుదిద్దుకుంది. ఇది సోమవారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి, మరో మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఈ మినీ శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే రాయగిరి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే దిశగా పనులు సాగుతున్నాయి. యాదగిరిగుట్ట నుంచి రాయగిరి వరకు వెళ్లే 6కి.మీ. రహదారిని రూ.100కోట్లతో అభివృద్ధి పరిచారు. రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక.. మినీ శిల్పారామం కోసం ప్రభుత్వం రూ.2కోట్లు వెచ్చించింది. స్వాగత తోరణాన్ని అందంగా తీర్చిదిద్దాదు. లోపల పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పచ్చదనం, చిన్న చిన్న కుటీరాల మధ్య పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు సేదతీరేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు.
విభిన్న రుచులను ఆస్వాదించేందుకు ఫుడ్‌కోర్టును ఏర్పాటు చేశారు. చెరువులో బోటింగ్ సదుపాయం కల్పించారు. రాత్రిపూట వెలుగులు విరజిమ్మేలా ప్రత్యేక లైటింగ్ కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే రాయగిరి చెరువు దగ్గర యాదగిరిగుట్టకు వెళ్లే రహదారి పక్కన 2015-17 మధ్య రూ.8 కోట్లు వెచ్చించి రెండు అర్బన్ పార్కులు పర్యాటక ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఈ పార్కులకు నరసింహ, ఆంజనేయ అరణ్యాలుగా నామకరణం చేశారు. రాయగిరి-1 రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని 140ఎకరాల్లో ఏర్పాటుచేసిన ఆంజనేయ అరణ్యంలో 60వేల మొక్కలను నాటారు. ఈ ప్రాంతం ఇప్పుడు దట్టమైన అడవిని తలపిస్తోంది. రాయగిరి-2 రిజర్వ్‌పార్కు పరిధిలో 240ఎకరాల్లో ఏర్పాటుచేసిన అరణ్యంలో 30వేలకు పైగా మొక్కలు నాటారు. ఇక్కడ సెల్ఫీ పాయింట్లు, ఎంట్రీ ప్లాజాలు, రకరకాల చెట్లు, నీటితో కళకళలాడే చెక్‌డ్యాంలు, వాకింగ్ ట్రాక్‌లను నిర్మించారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 04:19 AM