Cannabis Seizure: బ్యాంకాక్ నుంచి గంజాయి
ABN, Publish Date - Jul 31 , 2025 | 05:49 AM
బ్యాంకాక్‌లో హైడ్రోఫోబిక్ పద్ధతిలో సాగు చేసిన గంజాయిని దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఓ
శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అరెస్టు
40 కిలోల గంజాయి సీజ్
విలువ రూ.14 కోట్లు: ఎన్‌సీబీ
హైదరాబాద్/శంషాబాద్ రూరల్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): బ్యాంకాక్‌లో హైడ్రోఫోబిక్ పద్ధతిలో సాగు చేసిన గంజాయిని దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఓ మహిళను ఎన్‌సీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఆ మహిళ తీసుకువచ్చిన రెండు బ్యాగుల్లో రహస్య అరల్లో 40.2 కిలోల గంజాయిని తీసుకువచ్చినట్లు.. దాని విలువ రూ.14 కోట్లుగా వెల్లడించారు. దీనికి భారత్‌లో భారీ డిమాండ్ ఉంటుందని, దాంతో స్మగ్లర్ల టార్గెట్‌గా మారిందని చెప్పారు. అరెస్టయిన మహిళ బ్యాంకాక్ నుంచి దుబాయ్‌కి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలిపారు. ‘‘ఆ మహిళ ఎవరి కోసం గంజాయి తీసుకువచ్చారు? ఈ ముఠా వెనక నెట్‌వర్క్‌ను ఎవరు నడుపుతున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఎన్‌సీబీ సూపరింటెండెంట్ అశిష్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News
Updated Date - Jul 31 , 2025 | 05:49 AM