ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Women Suicide Attempt: హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే

ABN, Publish Date - Jul 16 , 2025 | 09:56 AM

Women Suicide Attempt: న్యాయం కోసం దాదాపు నాలుగు నెలల నుంచి స్టేషన్ చుట్టూ బాధిత కుటుంబ సభ్యులు తిరుగుతున్న పరిస్థితి. ఈనెల 5న డబ్బులు చెల్లించేందుకు రమేష్ అగ్రిమెంట్ రాసిచ్చాడు. అయితే ఇచ్చిన గడువు వరకు డబ్బులు ఇవ్వకపోగా బాధితులపైనే ముల్కనూరు పోలీస్ ‌స్టేషన్‌లో రమేష్ ఫిర్యాదు చేశాడు.

Women Suicide Attempt

హనుమకొండ, జులై 16: జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చకుండా కేసులు పెట్టి వేధిస్తున్నారని డబ్బులు ఇచ్చిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పన్నెండు సంవత్సరాల క్రితం దేవన్నపేటకు చెందిన చంద్రశేఖర్ నుంచి ముల్కనూరుకు చెందిన గుడికందుల రమేష్ అప్పు తీసుకున్నాడు. కొంతకాలం తరువాత అప్పు తీర్చమని అడిగితే తీర్చకుండా రమేష్ ఇబ్బందులకు గురిచేశాడు. అప్పు తీర్చేందుకు రేపు, మాపు అంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు గుడికందుల రమేష్ . దీనిపై చంద్రశేఖర్ పలుమార్లు పంచాయితీలు పెట్టినప్పటికీ రమేష్ పట్టించుకోలేదు. అంతేకాకుండా ముల్కనూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా పట్టించుకోలేదు.

న్యాయం కోసం దాదాపు నాలుగు నెలల నుంచి స్టేషన్ చుట్టూ బాధిత కుటుంబ సభ్యులు తిరుగుతున్న పరిస్థితి. ఈనెల 5న డబ్బులు చెల్లించేందుకు రమేష్ అగ్రిమెంట్ రాసిచ్చాడు. అయితే ఇచ్చిన గడువు వరకు డబ్బులు ఇవ్వకపోగా బాధితులపైనే ముల్కనూరు పోలీస్ ‌స్టేషన్‌లో రమేష్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించి విచారణ చేపట్టారు. మూడు రోజులుగా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగారు బాధిత కుటుంబసభ్యులు. అప్పు ఇప్పించాల్సిన పోలీసులే తిరిగి బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారని ముల్కనూరు ఎస్సైపై ఆరోపణలు గుప్పించారు.

పోలీసులు బెదిరింపులకు పాల్పడటం, ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు... రమేష్ ఇంటి ఎదుట గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే బాధితురాలి బంధువులు నిందితుడి ఇంటికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితి.

ఇవి కూడా చదవండి..

సీపీఐ నేతపై కాల్పులు... నిందితులను గుర్తించిన పోలీసులు

నెలవారీ ఖర్చులకూ క్రెడిట్‌ కార్డులే దిక్కు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2025 | 10:43 AM