నెలవారీ ఖర్చులకూ క్రెడిట్ కార్డులే దిక్కు
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:56 AM
దేశంలో క్రెడిట్ కార్డుల సంస్కృతి పెరిగిపోతోంది. చేతిలో చిల్లిగవ్వ లేక పోయినా.. జేబులో క్రెడిట్ కార్డు ఉంటే చాలు ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నారు. బడా బాబులేగాక...
థింక్360.ఏఐ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో క్రెడిట్ కార్డుల సంస్కృతి పెరిగిపోతోంది. చేతిలో చిల్లిగవ్వ లేక పోయినా.. జేబులో క్రెడిట్ కార్డు ఉంటే చాలు ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నారు. బడా బాబులేగాక, చిరుద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తులకు సైతం ఇప్పుడు క్రెడిట్ కార్డు నిత్యావసరమైంది. థింక్ 360.ఏఐ అనే సంస్థ గత ఏడాది కాలంగా దాదాపు 20,000 మంది చిరుద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తుల ఆర్థిక ప్రవర్తనను సర్వే చేసి..ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. చిరుద్యోగుల్లో నెలకు రూ.50,000 కంటే తక్కువ జీతం ఉన్న వారి ఖర్చుల తీరుతెన్నులను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంది.
సర్వే ముఖ్యాంశాలు
నెలవారీ ఖర్చులను క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తున్న93 శాతం మంది చిరుద్యోగులు
స్వయం ఉపాధిలో ఉన్న వ్యకుల్లోనూ 85 శాతం మందికి నెలవారీ ఖర్చుల చెల్లింపులకు క్రెడిట్ కార్డులే గతి.
‘బై నౌ పే లేటర్’ (బీఎన్‌పీఎల్) విధానం పట్ల ఆకర్షితులైన 18 శాతం మంది స్వయం ఉపాధి వ్యక్తులు. అదే బాటలో 15% మంది చిరుద్యోగులు
గిగ్ వర్కర్లతో పాటు అందరికీ తప్పనిసరి అవసరంగా మారిన క్రెడిట్ కార్డులు, బీఎన్‌పీఎల్ విధానం
2022-23 ఆర్థిక సంత్సరంలో కొత్తగా మంజూరు చేసిన వ్యక్తి గత రుణాల్లో 72 శాతం (సుమారు రూ.92,000 కోట్లు) వాటా ఫిన్‌టెక్ కంపెనీలదే
ఇవి కూడా చదవండి:
క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..
సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి