GV Babu: అనారోగ్యంతో బలగం నటుడు.. సహాయం కోసం ఎదురు చూపు..
ABN, Publish Date - May 06 , 2025 | 07:27 AM
వెండి, బుల్లితెర కళాకారుడు గుడిబోయిన బాబు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు అనారోగ్యంతో మంచంపట్టారు. వైద్యం, మందుల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు, వరంగల్ రంగస్థల కళాకారుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
వరంగల్: వేణు (Venu) యెల్డండి దర్శకత్వం (Cine Director)లో నిర్మించిన బలగం చిత్రం (Balagam movie)లో కొమురయ్య తమ్ముడిగా అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు (GV Babu)కొంత కాలంగా మూత్రపిండాల సమస్య (Kidney Disease)తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యం చేయించుకోడానికి, మందుల కొనుగోలుకు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. జీవీ బాబు కుటుంబ సభ్యులు కొన్నిరోజులుగా వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతనికి డయాలసిస్ చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవీ బాబుకు మెరుగైన వైద్యం అందించాలని, దాతలు, కళాకారులు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు రావాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కోరారు.
Also Read: ఊహించని విషాదం.. పెళ్లికి ఒకరోజు ముందు..
కాగా వెండి, బుల్లితెర కళాకారుడు గుడిబోయిన బాబు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు అనారోగ్యంతో మంచంపట్టారు. వైద్యం, మందుల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు, వరంగల్ రంగస్థల కళాకారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన బాబు రంగస్థల కళాకారుడి నుంచి సినీ నటుడిగా ఎదిగారు. బలగం చిత్రంలో అంజన్నగా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రభుత్వం, దాతలు సానుకూలంగా స్పందించి గుడిబోయిన బాబుకు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
కాగా ప్రముఖ జానపద కళాకారుడు, ‘బలగం’ చిత్ర గాయకుడు పస్తం మొగిలయ్య (67) గత ఏడాది డిసెంబర్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. వరంగల్‌కు చెందిన ఆయన కొంత కాలంగా మూత్ర పిండాల సంబంధ వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మొగిలయ్య చిన్నతనం నుంచి తండ్రి వెంకటయ్య నుంచి వారసత్వంగా వచ్చిన జానపద కళలను ప్రదర్శించేవారు. తెలంగాణవ్యాప్తంగా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లోని తెలుగు ప్రాంతాల్లో మొగిలయ్య-కొమురమ్మ దంపతులు 20 వేల వరకు బుర్ర కథల ప్రదర్శనలిచ్చి అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్బీకేల్లో రూ.100 కోట్లు తినేశారు
వీడియో కాల్ ద్వారా నర్సు వైద్యం...
For More AP News and Telugu News
Updated Date - May 06 , 2025 | 11:42 AM