Share News

Viral Video: ఊహించని విషాదం.. పెళ్లికి ఒకరోజు ముందు..

ABN , Publish Date - May 06 , 2025 | 06:44 AM

viral video: వెంటనే ఆమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే, ఆమె ఎంత లేపినా పైకి లేపలేదు. దీంతో వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు.

Viral Video: ఊహించని విషాదం.. పెళ్లికి ఒకరోజు ముందు..
viral video

మనిషి జీవితం నీటి బుడగలాంటిది. ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వరికీ తెలీదు. భూమ్మీద నూకలు ఉన్నంత వరకే.. బంధాలైనా, బాధలైనా.. మనిషికి చావు తప్పదు కానీ.. ఆ చావు.. ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందన్నది బాధించే విషయం. అందరితో కలిసి ఆడుతూ, పాడుతూ తిరిగిన మనిషి ఉన్నట్టుండి ఠక్కున చచ్చిపోవచ్చు. తాజాగా, పెళ్లికి ఒక రోజు ముందు ఓ అమ్మాయి చనిపోయింది. హల్దీ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తూ ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆదివారం చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, బదౌన్ జిల్లా నూర్‌పూర్ గ్రామానికి చెందిన 22 అమ్మాయికి అదే ప్రాంతానికి చెందిన అబ్బాయితో పెళ్లి నిశ్చయం అయింది. నిన్న ( సోమవారం) రోజు పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హల్దీ ఫంక్షన్ జరిగింది. ఆ హల్దీ ఫంక్షన్ సందర్భంగా యువతి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంది. అప్పుడే అనుకోని విషాదం చోటుచేసుకుంది. యువతి ఉన్నట్టుండి ఠక్కున కింద పడిపోయింది. ఇది గమనించిన బంధుమిత్రులు షాక్ అయ్యారు.


వెంటనే ఆమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే, ఆమె ఎంత లేపినా పైకి లేవలేదు. దీంతో వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. యువతి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదం నెలకొంది. యువతికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై స్పందిస్తున్న నెటిజన్లు యువతి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Worker Aid Hike: ఉపాధి శ్రామికుల ప్రమాద పరిహారం పెంపు

MSME Financial Solutions: ఎంఎస్ఎంఈలకు ట్రెడ్స్‌లో చెల్లింపులు

Updated Date - May 06 , 2025 | 06:48 AM