Share News

Worker Aid Hike: ఉపాధి శ్రామికుల ప్రమాద పరిహారం పెంపు

ABN , Publish Date - May 06 , 2025 | 05:39 AM

ఉపాధి హామీ పనుల్లో ప్రాణాలు కోల్పోతే శ్రామికులకి ఎక్స్‌గ్రేషియా రూ.50,000 నుండి రూ.2 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత వైకల్యం లేదా చిన్నపిల్లల గాయాల విషయంలో కూడా పరిహారం పెంచారు

Worker Aid Hike: ఉపాధి శ్రామికుల ప్రమాద పరిహారం పెంపు

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులు పని ప్రదేశాల్లో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పని ప్రదేశాల్లో గాయపడి శాశ్వత వైకల్యం చెందితే పరిహారాన్ని రూ.ఒక లక్షకు పెంచారు. గాయపడటం ద్వారా పూర్తిగా మంచానపడితే రూ.2 లక్షలకు పెంచారు. పని ప్రదేశాల్లో ఆరేళ్ల లోపు పిల్లలు గాయపడి వికలాంగులైతే రూ.లక్షకు పెంచుతూ సవరణ జీఓ జారీ చేశారు.

Updated Date - May 06 , 2025 | 05:47 AM