ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Komati Reddy: ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్‌కు బానిసలు

ABN, Publish Date - May 01 , 2025 | 06:31 AM

ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని, దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లో 22 మందికి సినిమా టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చిన తరువాత, వారికి సర్టిఫికెట్‌లు అందించారు.

  • సినిమా టెక్నీషియన్లకు న్యాక్‌లో శిక్షణ: మంత్రి కోమటిరెడ్డి

దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని, ఉద్యోగాలు లేక యువత డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. నేషనల్‌ అకాడమీఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లో నిర్వహించిన కార్యక్రమంలో సినిమా కోర్సులు నేర్చుకున్న 22 మందికి సర్టిఫికెట్‌లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా రంగంలోని వివిధ రకాల టెక్నీషియన్లకు కూడా న్యాక్‌లో శిక్షణ ఇస్తామన్నారు. అంతకుముందు న్యాక్‌ భవనంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌, సోలార్‌ రూఫ్‌టాప్‌, స్పేస్‌ అకాడమీ డబ్బింగ్‌ స్టూడియోను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఆ తరువాత ఐసీఐసీఐ బ్యాంకుతో న్యాక్‌ కుదుర్చుకున్న ఒప్పంద కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 06:31 AM