ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gadwal Tragedy: వాహనం ఢీకొని ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినుల మృతి

ABN, Publish Date - Apr 30 , 2025 | 03:44 AM

గద్వాలలో బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ వల్ల మరొక విద్యార్థిని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు

  • మరో విద్యార్థినితోపాటు ఓ బాలుడికి తీవ్ర గాయాలు

  • డ్రైవర్‌ మద్యం మత్తే కారణం.. త్రుటిలో తప్పించుకున్న గర్భిణి

  • జోగులాంబ గద్వాలలో ఘటన

హైదరాబాద్‌/ గద్వాల క్రైం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కళాశాల నుంచి హాస్టల్‌కు వెళ్తున్న ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినులు వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో మరో విద్యార్థినితో పాటు ఓ బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం లింగంపల్లికి చెందిన జి. మహేశ్వరి (20), వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం రాయన్‌పల్లికి చెందిన కొంకల మనీష (20) హాస్టల్‌లో ఉంటూ గద్వాల కళాశాలలో నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం కళాశాల నుంచి హాస్టల్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మహేశ్వరి, మనీష అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటే ఉన్న యాదాద్రి జిల్లాకు చెందిన మరో విద్యార్థిని బండారి ప్రణతి కాలు విరిగింది.


వీరిని ఢీకొట్టిన తర్వాత వాహనం పక్కన ఉన్న పానీపూరి బండిపైకి దూసుకెళ్లడంతో అక్కడ నిల్చుని ఉన్న చరణ్‌భూపాల్‌ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ప్రణతిని, చరణ్‌భూపాల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేగంగా వస్తున్న వాహనాన్ని చూసి ఆగడంతో ఓ గర్భిణీ ఈ ప్రమాదం నుంచి త్రుటి లో బయటపడింది. అయితే మద్యం తాగి వాహనం నడిపిన డ్రైవర్‌ను కఠినంగా శిక్షించడంతో పాటు, మృతి చెందిన తమ స్నేహితుల కుటుంబాలకు న్యాయం చేయాలని నర్సింగ్‌ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. కళాశాల యాజమాన్యం నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

నర్సింగ్‌ విద్యార్థినుల మృతి బాధాకరం: దామోదర

గద్వాల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినులు మృతి చెందడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరి వైద్యానికి సాయం అందించాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 03:45 AM