ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: నేటి నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

ABN, Publish Date - May 05 , 2025 | 04:12 AM

రాష్ట్ర రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పనకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే నూతన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పనకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే నూతన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 5 నుంచి జూన్‌ 13 వరకు సుమారు 1200 గ్రామాలలో నిర్వహిస్తామన్నారు. సుమారు 200లకు పైగా శాస్త్రవేత్తలతో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. దక్షిణ తెలంగాణ మండలాల్లో సుమారు 100 బృందాలు, ఉత్తర, మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు 50 బృందాలు పాల్గొంటాయన్నారు.


ఒక్కో బృందం రోజూవారి కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపిక చేసుకున్న గ్రామాల రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారన్నారు. యూరియా వాడకం తగ్గింపు, జాగ్రత్తగా రసాయనాల వాడకం, రశీదులను భద్రపరచడం, సాగు నీటి ఆదా, పంటల మార్పిడి, చెట్లను పెంపకంపై అవగాహన కల్పిస్తారన్నారు. వీటితోపాటు రైతాంగం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు సూచనలు, సలహాలందిస్తారని తెలిపారు. రైతులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, వ్యవసాయ సంబంధిత అంశాలపై అనుమానాలను శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. సోమవారం వికారాబాద్‌ జిల్లాలోని ధరూర్‌లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో కలిసి మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 04:12 AM