ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: టీపీసీసీకి మూడ్రోజుల్లో కొత్త కార్యవర్గం!

ABN, Publish Date - May 15 , 2025 | 03:50 AM

టీపీసీసీ కొత్త కార్యవర్గ నియామకం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్‌ అధిష్ఠానం రెండు, మూడు రోజుల్లో నూతన కమిటీని ప్రకటించే అవకాశముంది.

  • అధిష్ఠానంతో మహేశ్‌గౌడ్‌ భేటీ

న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ కొత్త కార్యవర్గ నియామకం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్‌ అధిష్ఠానం రెండు, మూడు రోజుల్లో నూతన కమిటీని ప్రకటించే అవకాశముంది. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. కేసీ నివాసంలో సుమారు గంటసేపు జరిగిన సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు.


నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారిని పార్టీ పదవుల్లో తీసుకోకూడదనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పదవుల్లోకి తీసుకుంటే.. వారిని నామినేటెడ్‌ పదవికి రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే సిద్ధం చేసిన జాబితాపై తుది చర్చలు జరిగాయని.. 100 మందితో జంబో కార్యవర్గం ఏర్పాటు అవుతుందని తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:50 AM