ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram: 8వ రోజు లక్ష మంది పుష్కర స్నానం!

ABN, Publish Date - May 23 , 2025 | 05:27 AM

కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎనిమిదో రోజు, గురువారం దాదాపు లక్ష మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించినట్లు అధికారుల అంచనా.

  • కాళేశ్వరంలో కిటకిటలాడిన ఘాట్లు

  • చివరి నాలుగు రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం

భూపాలపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎనిమిదో రోజు, గురువారం దాదాపు లక్ష మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించినట్లు అధికారుల అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో పుష్కర ఘాట్లు, ముక్తీశ్వరాలయం కిటకిటలాడాయి. బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకే్‌షరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు, వ్యవసాయ రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి, సభ్యుడు గడుగు గంగాధర్‌, సినీ నటుడు అల్లు అర్జున్‌ తల్లి అల్లు నిర్మల తదితర ప్రముఖులు అంతర్వాహినిలో గురువారం పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా, పుష్కరాలకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది.


దీంతో చివరి నాలుగు రోజులు భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం పుష్కరాలకు విచ్చేసిన భక్తులను గురువారం ఇబ్బందులకు గురి చేసింది. పుష్కర ఘాట్లతోపాటు, తాత్కాలిక బస్టాండ్‌, పుష్కర ఘాట్లకు వెళ్లే మట్టి రోడ్లు బురదమయం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పార్కింగ్‌ స్థలాల్లోని కొన్ని వాహనాలు నీళ్లలో మునిగిపోయాయి. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా అన్నారం క్రాస్‌ నుంచి కాళేశ్వరానికి వాహనాలను మళ్లించారు. కానీ, పార్కింగ్‌ స్థలాల్లో ఉన్న వాహనాలు కదలకపోవడంతో ఐదు కిలోమీటర్ల మేర అడవిలోనే ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌కు కారణమైన వాహనాలను తొలగించేందుకు క్రేన్లు, ట్రాక్టర్లను రంగంలోకి దింపిన పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రయత్నించి విఫలమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:27 AM