ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: మార్చి నెలలో వాణిజ్య పన్నుల వృద్ధి 6%

ABN, Publish Date - May 13 , 2025 | 05:00 AM

గడిచిన సంవత్సరం మార్చి నెలతో పోలిస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో వాణిజ్య పన్ను వసూళ్లలో 6 శాతం మేర వృద్ధి నమోదైందని, ఇది మంచి పరిణామమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

  • భవిష్యత్తులోనూ ప్రణాళికతో ముందుకెళ్లాలి

  • క్యాబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): గడిచిన సంవత్సరం మార్చి నెలతో పోలిస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో వాణిజ్య పన్ను వసూళ్లలో 6 శాతం మేర వృద్ధి నమోదైందని, ఇది మంచి పరిణామమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదాయ వనరుల సమీకరణపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సచివాలయంలో భట్టి అధ్యక్షతన సమావేశమైంది. ఇందులో కమిటీ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గడిచిన ఏడాది(2023-24) మార్చి లో వసూలైన జీఎస్టీ, వ్యాట్‌ కంటే ఈసారి మార్చిలో రూ.600 కోట్ల వృద్ధి ఉంటుందని అంచనా వేయగా.. రూ.500 కోట్ల ఆదాయం ఖజానాకు సమకూరిందని తెలిపారు. అంటే 6 శాతం వృద్ధి నమోదైందని అన్నారు. ఆదాయ పెంపు విషయంలో భవిష్యత్తులోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు.


ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచే క్రమంలో ఎక్కడైనా లీకేజీలుంటే.. వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశించారు. అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల విక్రయాల్లో ప్రగతి కనిపిస్తున్నప్పటికీ.. వ్యవసాయ భూములు, ఓపెన్‌ ప్లాట్ల విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదన్నారు. దీనికి కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. గిరిజన ప్రాంతాల్లోని సొసైటీల ద్వారా ఇసుక అమ్మకాలు చేపట్టాలని, అర్హులైన వారిని గుర్తించి ట్రైబల్‌ సొసైటీలలో సభ్యులుగా చేర్చాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు సూచించింది. జిల్లా కేంద్రాల్లోని విలువైన భూములను గుర్తించి, వాటిని సంరక్షించే బాధ్యతలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతుల విషయంలో హెచ్‌ఎండీఏ వేగం పెంచాలని చెప్పింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కౌలు రైతులకు శుభవార్త..

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..

భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..

For More AP News and Telugu News

Updated Date - May 13 , 2025 | 05:00 AM