ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Godavari: గోదావరి-బనకచర్లను అడ్డుకుందాం!

ABN, Publish Date - Jun 18 , 2025 | 04:31 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మించకుండా సంఘటితంగా పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీపై సంఘటిత పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

  • నేడు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం

  • అందరికీ ఆహ్వానం పంపిన సర్కారు

  • ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై

  • ప్రజంటేషన్‌ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్‌

  • ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

  • ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు

  • కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మించకుండా సంఘటితంగా పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ఆర్థిక సహాయం, అనుమతులు ఇవ్వకుండా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వీలుగా బుధవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రానికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు. ఈ భేటికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రత్యేక అతిథులుగా హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే అనర్థాలను వివరిస్తూ నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇవ్వనున్నారు. పీపీటీ అనంతరం ప్రాజెక్టుపై ఎంపీల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. ఇక ప్రాజెక్టుకు ఎటువంటి సహాయం చేయరాదని కోరుతూ కేంద్రానికి రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో కలిసి లేఖ రాసే అవకాశాలున్నాయి. ఇక బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం విధివిధానాలు(టీవోఆర్‌-టర్మ్‌ అండ్‌ రిఫరెన్స్‌) జారీ చేయరాదని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేంద్రయాదవ్‌కు.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారికంగా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జాలు మంగళవారం లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణ అభ్యంతరాలేవీ పట్టించుకోకుండా పర్యావరణ అనుమతులు తీసుకోవడానికి ఏయే ప్రక్రియలు అనుసరించాలి..? ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై టీవోఆర్‌ జారీ చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ నిపుణుల మదింపు కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా టీవోఆర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా.. అందుకు అంగీకారం తెలపడం నిపుణు ల మదింపు కమిటీ బాధ్యత. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నిర్మిస్తారా..? లేదా..? అనేది పర్యావరణ అనుమతి ఇచ్చే క్రమంలో పరిశీలిస్తారు. తాజా పరిణామాలతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టును సమర్థిస్తూ మంగళవారం ఏపీ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వ గా.. బుధవారం ఇక్కడ మంత్రి ఉత్తమ్‌ పీపీటీ ఇవ్వనున్నారు. దాంతో పోటాపోటీగా పీపీటీల ప్రదర్శన జరుగుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ ప్రాజెక్టుపై పీపీటీ ఇవ్వడమే కాకుండా మధ్యేమార్గంగా తీసుకోవాల్సిన చర్యలపై ఉత్తమ్‌కు లేఖ కూడా రాశారు.

పాత ప్రాజెక్టే.. కొత్తగా..

వాస్తవానికి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పాతదే. 2018లోనే ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి-పెన్నా అనుసంధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అప్పట్లో ఏపీ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంలోనూ దీన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత దీనిపేరును 2019లో పల్నాడు మిటిగేషన్‌ ప్రాజెక్టుగా మార్చి.. పలు ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టుకు గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎ్‌సకు సమాచారం ఉన్నప్పటికీ.. ఆ పార్టీ మౌనంగానే ఉండిపోయింది. తాజాగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక గోదావరి-బనకచర్ల పేరుతో ప్రాజెక్టును ప్రతిపాదించారు. పోలవరం విస్తరణలో భాగంగా కుడి కాలువ నుంచి 200 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీలో తరలించనున్నారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడికాలువపై ఎస్కేప్‌ ఛానల్‌ ద్వారా ఏపీలోని పల్నాడు జిల్లాలో కొత్తగా నిర్మించతలపెట్టిన 173 టీఎంసీల సామర్థ్యం కలిగిన బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి నీటిని పంపిస్తారు. అక్కడి నుంచి సొరంగాలు, ఓపెన్‌ కెనాల్‌ ద్వారా బనకచర్లకు నీటిని తరలించాలనేది ఏపీ ఉద్దేశం. రూ.80 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర సహాయాన్ని ఏపీ అభ్యర్థిస్తోంది. ఇప్పటికే ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)ను కేంద్రానికి అందించగా.. కేంద్ర జలవనరుల సంఘం ఈ నివేదికను ప్రాజెక్టు ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఒడి సా, ఛత్తీ్‌సగఢ్‌లతో పాటు.. గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు పంపించింది. పీఎ్‌ఫఆర్‌పై ఆయా రాష్ట్రా ల అభిప్రాయాలను కోరింది. కాగా, అఖిలపక్ష ఎంపీ ల భేటీకి బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యుల హాజరుపై అను మానాలు వ్యక్తమవుతున్నాయి. మజ్లిస్‌ ఎంపీ అసదు ద్దీన్‌ ఒవైసీ సమావేశానికి హాజరుకావడానికి సుము ఖత వ్యక్తం చేశారు. దాంతో అధికార కాంగ్రెస్‌ కు చెందిన 8 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యు లు, ఒక మజ్లిస్‌ సభ్యుడు కలిపి 11 మంది సమా వేశానికి హాజరయ్యే అవ కాశాలున్నాయి.

ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ లేఖాస్త్రాలు

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పలు లేఖలు రాసింది. ఈ ప్రాజెక్టును గోదావరి ట్రైబ్యునల్‌-1980 తీర్పునకు వ్యతిరేకంగా, 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా చేపడుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌లకు తెలంగాణ లేఖలు రాసింది.తాజాగా రాసిన లేఖకు కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌ బదులిస్తూ.. ‘గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి అందలేదని మంత్రి ఉత్తమ్‌కు లేఖ రాశారు. ‘డీపీఆర్‌ అందితే ప్రస్తుత మార్గదర్శకాలు, ట్రైబ్యునల్‌ అవార్డులు/అంతర్‌రాష్ట్ర ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని వివిధ నిబంధనల ప్రకారమే పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. లేఖలే కాకుండా ఈ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలిద్దరూ కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 18 , 2025 | 04:31 AM