Tribal Areas: అంగన్‌వాడీ నియామకాలపై కసరత్తు
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:31 AM
ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో అంగన్‌వాడీ సిబ్బంది నియామకంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రోస్టర్ పాయింట్ల ఖరారుకు కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో అంగన్‌వాడీ సిబ్బంది నియామకంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోస్టర్ పాయింట్లను ఖరారు చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదివారం ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ సునంద నేతృత్వంలో మరో ముగ్గురు అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైంది.
ఈ కమిటీలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సీడీపీవో మిల్క, హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జ్యాంతి, హైదరాబాద్ ప్రధాన కార్యాలయ సూపరింటెండెంట్ శేషుపద్మ ఉన్నారు. వీరు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్ లోని గిరిజన ప్రాంతాల్లో అంగన్‌వాడీ నియామకాలకు సంబందించి అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. తమ నివేదికను మంత్రి సీతక్కకు సమర్పిస్తారు. దాని ఆధారంగా ప్రభుత్వం రోస్టర్ పాయింట్లను ఖరారు చేసి నియామక ప్రక్రియకు తుదిరూపునిస్తుంది.
Updated Date - Jul 07 , 2025 | 02:31 AM