ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raithu Bharosa: నేడు రైతుభరోసా సంబరాలు

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:26 AM

వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

‘రైతు పండుగ’ పేరుతో నిర్వహిస్తున్న ప్రభుత్వం.. రాష్ట్ర సచివాలయానికి తరలిరానున్న రైతులు

  • పెట్టుబడి సాయంతో రైతుల్లో ఆనందం

  • 67 లక్షల మంది ఖాతాల్లో 8,285 కోట్లు

  • నేటితో పూర్తికానున్న నగదు బదిలీ

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి రైతులను రప్పించి పండుగ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి 2వేల మంది రైతులు రాజధానికి తరలి రానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. రైతులను సచివాలయాలనికి తీసుకొచ్చే బాధ్యతను వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించింది. మంగళవారం ఉదయం వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే రైతులు.. సాయంత్రం 4.30 గంటలకు సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులనుద్దేశించి మాట్లాడనున్నారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేసిన విధానం, రైతు సంక్షేమ పథకాలను సీఎం వివరించనున్నారు. కాగా, ఈసారి రైతుభరోసా పథకాన్ని రేవంత్‌ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాంటి పరిమితులు, షరతులు విధించకుండా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది.

ఈ మేరకు కోటిన్నర ఎకరాలకు.. ఎకరానికి రూ.6 వేల చొప్పున చెల్లించడానికి రూ.9 వేల కోట్ల నిధులు సర్దుబాటు చేసింది. ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులంతా కలిసి జయశంకర్‌ వర్సిటీలో వానాకాలం రైతుభరోసాకు శ్రీకారం చుట్టారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఆర్థికశాఖ నిధుల సర్దుబాటు చేసింది. ఇప్పటివరకు 67 లక్షల మంది రైతులకు రూ.8,285 కోట్ల నిధులు ఖాతాల్లో జమ చేశారు. సోమవారం నాటికి 15 ఎకరాల వరకు రైతుభరోసా చెల్లింపులు పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన రైతులకు మంగళవారం చెల్లింపులు పూర్తిచేయనున్నారు. సాయంత్రానికి నగదు బదిలీ పూర్తిచేసి సంబరాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు సంబరాల్లో పాల్గొనాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర చరిత్రలోనే రికార్డు: మంత్రి తుమ్మల

ఇచ్చినమాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరానికీ పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. సెక్రటేరియట్‌ వద్ద రైతుపండుగ నిర్వహించనున్న సభాస్థలిని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగానే 9 రోజుల్లో రెతుభరోసా నగదు బదిలీ పూర్తిచేశామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీ పడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎం రేవంత్‌కి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ పథకాన్ని కూడా ఇలాగే 2024 ఆగస్టు 15 లోగా పూర్తిచేశామని చెప్పారు. కేంద్రం కొనుగోలు చేయలేని పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయిస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలకు ఇవేమీ కడపడటంలేదా? రైతులకు మేలు చేసే ప్రభుత్వంపై బురదజల్లడమేనా? అని తుమ్మల ధ్వజమెత్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు: భట్టి, మహేశ్‌గౌడ్‌

అన్ని మండల కేంద్రాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. మండల కమిటీల ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించాలని, 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు అందించిన విషయాన్ని రైతులకు వివరించాలని అన్నారు. గాంధీభవన్‌లో మీనాక్షి నటరాజన్‌తో వారు సమావేశమయ్యారు. భట్టి మాట్లాడుతూ..1.49 కోట్ల ఎకరాలకు ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున రైతు భరోసా అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 04:26 AM