Summer Holidays: మే ఒకటి నుంచి వేసవి సెలవులు
ABN, Publish Date - Apr 29 , 2025 | 04:40 AM
రాష్ట్రంలోని 30 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచే సెలవులిచ్చారు.
రాష్ట్రంలోని 30 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచే సెలవులిచ్చారు. ఉస్మానియా విద్యార్థులకు మే 1 నుంచి 30వరకు, మహాత్మాగాంధీ, కాకతీయ విశ్వవిద్యాలయాలకు మే 31వరకు, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు జూన్ ఒకటో తేదీ వరకు సెలవులు ఖరారు చేశారు. పాలమూరు యూనివర్సిటీకి మే 2 నుంచి జూన్ 1 వరకు సవరించారు.
కొన్ని విశ్వవిద్యాలయాల్లో సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండటంతో షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షల సమయంలో విద్యార్థులకు వసతులు కల్పించడంతో పాటు ఆయా సబ్జెక్టుల అధ్యాపకులను కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
Updated Date - Apr 29 , 2025 | 04:40 AM