ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nampally: చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

ABN, Publish Date - Jun 07 , 2025 | 06:11 AM

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈనెల 8, 9 తేదీల్లో జరిగే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తెలిపారు.

  • 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ సిటీ, గోషామహల్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈనెల 8, 9 తేదీల్లో జరిగే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తెలిపారు. చేప ప్రసాదం నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్‌ గౌడ్‌తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.


చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్‌ హైదరాబాద్‌ రీజియన్‌ ఈడీ రాజశేఖర్‌ తెలిపారు. రైల్వేస్టేషన్లు, ముఖ్యమైన బస్టాండ్లతో పాటు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు బస్సులు ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 06:12 AM