ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BRS Activists: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్

ABN, Publish Date - Mar 17 , 2025 | 01:06 PM

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూలో నిరసనలు, ధర్నాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

Tension at Telangana Assembly 2025

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓయూలో నిరసనలు, ధర్నాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆ క్రమంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించేందుకు కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. అయితే, ముందుగా అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.


ఉస్మానియా యూనివర్శిటీలో నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్, విద్యార్థి సంఘాల కార్యకర్తలు యత్నించారు. ఈ నిర్ణయం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు అసంతృప్తితో నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అదే సమయంలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.


అధికార పార్టీ తీరు ప్రజా వ్యతిరేకమని, ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాంతియుతంగా తమ నిరసన తెలుపుతుండగానే పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓస్మానియా యూనివర్శిటీలోనూ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగాయి. పోలీసులు అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, నిరసనకారులను అడ్డుకున్నారు.


ఇవి కూడా చదవండి:

Revanth Reddy: బీజేపీ ఎంపీ డీకే అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. పోలీసులకు ఆదేశం


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 17 , 2025 | 01:43 PM