Admissions 2025: తెలుగు వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
ABN, Publish Date - May 27 , 2025 | 04:49 AM
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, శాస్ర్తీయ నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర- పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా సబ్జెక్టులతో ఎం.ఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం తెలుగు వర్సిటీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సాధారణ రుసుంతో జూన్ 24లోపు, ఆలస్య రుసుంతో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Updated Date - May 27 , 2025 | 04:49 AM