ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రంలో మరిన్ని మైక్రో బ్రూవరీలు

ABN, Publish Date - May 17 , 2025 | 03:57 AM

హైదరాబాద్‌ పబ్బులు, క్లబ్బులకే పరిమితమైన మైక్రో బ్రూవరీలు త్వరలో జిల్లాల్లోనూ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న మైక్రోబ్రూవరీలను విస్తృతం చేయబోతోంది తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ.

  • హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు విస్తరించే యోచన!

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పబ్బులు, క్లబ్బులకే పరిమితమైన మైక్రో బ్రూవరీలు త్వరలో జిల్లాల్లోనూ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న మైక్రోబ్రూవరీలను విస్తృతం చేయబోతోంది తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ. లోకల్‌ బ్రాండ్లతో తయారు చేసి బీర్‌ ప్రియులకు ఇక తాజాగా డ్రాట్‌ బీరు అందించనుంది. అందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ అధికారులు మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాల తయారీలో నిమగ్నమయ్యారు. మైక్రోబ్రూవరీల ఏర్పాటు వల్ల ఆదాయం పెంచుకోవచ్చునని ఎక్సైజ్‌శాఖ యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1171 బార్లు ఉన్నాయి. ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చిన బార్లతో కలిపితే ఈ సంఖ్య పెరగనుంది. వీటితో పాటు హైదరాబాద్‌, శంషాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌ వంటి ప్రాంతాల్లో 55కిపైగా పబ్బులున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల్లో 18వరకు మైక్రోబ్రూవరీలు నడుస్తున్నాయి. వీటి వార్షిక బీరు ఉత్పాదకశక్తి సుమారు 18 లక్షల బల్క్‌లీటర్లుకుపైనే. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణెలో మైక్రోబ్రూవరీలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి తరహాలోనే గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2015లో ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ రావడంతో అందుకు తగిన ప్రతిపాదనలు సిద్దం చేసుకుని 2016లో 50 కంపెనీలు పోటీపడుతూ దరఖాస్తు చేసుకోగా.. 18 కంపెనీలకు మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత కూడా మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు డిమాండ్‌ పెరుగుతూనే వచ్చింది. రాష్ట్రంలో 2025-26లో రూ.27,623 కోట్లు రాబట్టాలని ఎక్సైజ్‌శాఖకు ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించడంతో బార్లు ఏర్పాటుతో పాటు కొత్త బ్రాండ్‌ల మద్యం తీసుకరావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బీరు ధరలు పెంచగా.. మద్యం ధరలు కూడా పెరగనున్నాయి. ఆదాయం రాబట్టుకోవడంలో భాగంగా ఈ ఏడాదిలో బెంగళూరు తరహాలో రాష్ట్రంలో మైక్రోబ్రూవరీల ఏర్పాటును తెరమీదకు తీసుకొచ్చారు. అక్కడ 100 వరకు ఉండగా.. రాష్ట్రంలో కొత్తగా కనీసం 50వరకైనా ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వీటిని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లోనూ వ్యాపారుల నుంచి అధిక డిమాండ్‌ వస్తోంది. వరంగల్‌, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండలోనూ మైక్రోబ్రూవరీల సంస్కృతిని విస్తరించడానికి అధికారుల పరిశీలన జరుగుతోంది. కొత్తగా బ్రూవరీలు అందుబాటులోకొస్తే దరఖాస్తు రుసుము, వ్యాట్‌, అమ్మకం పన్నుల వంటి ఆదాయం సమకూరనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్‌ శాఖ సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.


ఆకట్టుకునేలా సదుపాయాలు

మైక్రోబ్రూవరీల్లో వివిధ రకాలైన ప్లేవర్స్‌ కలిగిన బీరు లభిస్తుంది. వాస్తవానికి లిక్కర్‌ ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంటే అంత ఎక్కువ విలువ పెరుగుతుంది. కానీ.. బీరును ఎంత ఫ్రెష్‌గా తాగితే అంత టేస్ట్‌ ఉంటుందని మందుబాబులు చెప్పే మాట. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఏ బీర్‌ అయినా.. బ్రూవరీల్లో తయారయ్యేదే. రసాయనాలు కలిపినా.. మూడునాలుగు నెలలకు మించి నిల్వ ఉండదు. కానీ.. మైక్రోబ్రూవరీ్‌సలో లభించే డ్రాట్‌ బీరును ఎలాంటి సీసాలు, క్యాన్లలోను నింపరు. చిన్నచిన్న యంత్రాలు, ఉన్నచోటే తయారు చేస్తారు. లేదా దగ్గరలోని బ్రూవరీల్లో తయారు చేసి గంటల వ్యవధిలోనే కావాల్సిన చోటుకు బేరర్స్‌లో తరలిస్తారు. ఆ బీర్‌ను మగ్గుల్లో పట్టుకుని అప్పటికప్పుడే తాగడానికి ఆసక్తి చూపుతారు. తక్కువ ధరకు ఇవి లభిస్తుండటంతో బీర్‌ ప్రియులు తమకు ఇష్టమైన బ్రూలను ఆస్వాదిస్తారు. బీర్‌ ప్రియులను ఆకర్షించేలా వీటిలో విశాలమైన కిచెన్‌, డైనింగ్‌, పార్కింగ్‌, ఎక్కువ స్థలం కలిగి ఉండేలా ఏర్పాటు చేసి ఎక్కువ మంది వచ్చేలా ప్రయత్నిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:57 AM