ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Job Recruitment: విద్యుత్‌ సంస్థల్లో కొలువుల మేళా

ABN, Publish Date - Jun 15 , 2025 | 04:52 AM

తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు. బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాల నియామకాలు చేపడతారు.

  • నాలుగు సంస్థల్లో 5,368 పోస్టుల ఖాళీ

  • డిస్కమ్‌ల్లో 4175, జెన్‌కోలో 703, ట్రాన్స్‌కోలో 490 ఖాళీలు

  • బీటెక్‌/బీఈ, డిప్లొమా ఎలక్ట్రిక్‌, ఐటీఐ పూర్తి చేసిన వారికి అవకాశం

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు. బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాల నియామకాలు చేపడతారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కమ్‌ (ఎన్పీడీసీఎల్‌) పరిధిలో 2,170, దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌) పరిధిలో 2,005, తెలంగాణ ట్రాన్స్‌కోలో 703, తెలంగాణ జెన్‌కోలో 490 కొలువుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్నది. ఎన్పీడీసీఎల్‌లో 44 అసిస్టెంట్‌ ఇంజనీర్లు (ఏఈ), 30 సబ్‌ ఇంజనీర్‌, 2,090 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులు.. ఎస్పీడీసీఎల్‌లో 45 అసిస్టెంట్‌ ఇంజనీర్లు (ఏఈ), 30 సబ్‌ ఇంజనీర్లు, 1650 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులకు నియామకాలు చేపడతారు.

ఇక తెలంగాణ ట్రాన్స్‌కోలో 437 అసిస్టెంట్‌ ఇంజనీర్లు (ఏఈ), 63 సబ్‌ ఇంజనీర్‌, 189 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం), 14 జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులతో కలిపి 703 పోస్టులు రిక్రూట్‌ చేస్తారు. తెలంగాణ జెన్‌కోలో 175 ఏఈ, 150 సబ్‌ ఇంజనీర్‌, 165 జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/ జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌/ కెమిస్ట్‌/ జూనియర్‌ పర్సనల్‌ అటెండెంట్‌ పోస్టులతో కలిపి 490 భర్తీ చేయనున్నారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో.. బీటెక్‌/బీఈ పూర్తి చేసిన అభ్యర్థులతో 701 ఏఈ, పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్‌ డిప్లమా చేసిన అభ్యర్థులతో 509 సబ్‌ జూనియర్‌ ఇంజనీర్‌, ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

Updated Date - Jun 15 , 2025 | 04:52 AM