ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లోకల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ ప్లాన్‌

ABN, Publish Date - Jun 01 , 2025 | 03:31 AM

లోకల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ ప్లాన్‌(ఎల్‌ఏడీపీ)కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ మహా నగర విస్తరణలో పక్కగా ఎల్‌ఏడీపీని అమలు చేయడానికి అధ్యయనం చేస్తోంది.

  • అధ్యయనం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ సిటీ, మే31 (ఆంధ్రజ్యోతి): లోకల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ ప్లాన్‌(ఎల్‌ఏడీపీ)కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ మహా నగర విస్తరణలో పక్కగా ఎల్‌ఏడీపీని అమలు చేయడానికి అధ్యయనం చేస్తోంది. 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో 10,472చదరపు కిలోమీటర్ల మేర హెచ్‌ఎండీఏ పరిధి విస్తరించగా ఆ మేరకు త్వరలో సిద్ధమవ్వనున్న మెగా మాస్టర్‌ప్లాన్‌-2025లో కూడా ఎల్‌ఏడీపీని భాగం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌-2017ను హెచ్‌ఎండీఏ పకడ్బందీగా అమలు చేసేందుకు లోకల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎల్‌ఏడీపీ విధానాన్ని ఇప్పటికే గుజరాత్‌లో అమ లు చేస్తుండగా ఏపీలో అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో కీలకమైన సీఆర్‌డీఏ తరహాలో కసరత్తు చేస్తున్నారు. కాగా.. ఒక ప్రదేశంలో భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చేయాలి? ఎక్కడ ఎలాంటి సదుపాయాలు అవసరం? భూమిని ఎలా వినియోగించాలి? అనే అంశాలపై రూపొందించే పూర్తిస్థాయి ప్రణాళికనే లోకల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ (ఎల్‌ఏడీపీ). ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి, వనరులను సమర్థంగా వినియోగించడానికి ప్రజల భవిష్యత్తు అవసరాల కోసం ఎల్‌ఏడీపీ దోహదపడనుంది.


ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య టౌన్‌షి్‌పల విస్తరణలో ఎల్‌ఏడీపీ కీలకం కానుంది. ల్యాండ్‌పూలింగ్‌ స్కీమ్‌లో ప్రస్తుతం 50ఎకరాలకు పైగా భూములను అందించేందుకు యజమానులు ముందుకు వస్తేనే అక్కడ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ అభివృద్ధి చేస్తోంది. అందు లో యజమానులవాటా 60%, హెచ్‌ఎండీఏ వాటా 40% ఉంటుంది. అయితే హెచ్‌ఎండీఏ వాటాగా వచ్చే 40% విక్రయిస్తున్నారు. కానీ ఎల్‌ఏడీపీలో మాత్రం ప్రభుత్వ, అసైన్డ్‌, పట్టా భూములను సేకరించనున్నారు. నిర్ణీత ఎకరాలు అని గాకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా కొంత పరిధిని ఎల్‌ఏడీపీగా నిర్ణయించనున్నారు. అందులో అసైన్డ్‌, పట్టా భూములకు అవసరమైన అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయించనున్నారు. మిగిలిన స్థలాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించనున్నారు. స్థానికసంస్థలకు ల్యాండ్‌ బ్యాంకుగా ఉపయోగపడనుంది. ఆస్పత్రులు, స్కూళ్లను వివిధ ప్రజా అవసరాలకు వినియోగించనున్నారు. అవసరమైతే ఎల్‌ఐజీ, ఎంఐజీ, ఈడబ్ల్యూసీ నిర్మాణాలు కూడా చేపట్టాలని భావిస్తున్నారు. ఏపీలో సీఆర్‌డీఏ సేకరిస్తున్న భూములను ప్రజా అవసరాలకు ఏవిధంగా వినియోగిస్తున్నారో.. అదే తరహాలో ఎల్‌ఏడీపీలో నిర్ణయించే ప్రాంతాల్లో వచ్చే ల్యాండ్‌ బ్యాంకుతో స్థానిక సంస్థల, స్థానిక ప్రజల అవసరాలను తీర్చనున్నారు. హెచ్‌ఎండీఏ సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేస్తుండగా.. అదే సందర్భంలో ఎల్‌ఏడీపీపై అధ్యయనం చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసిన్నట్లు తెలిసింది. భవిష్యత్తు అవసరాల అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఏడీపీ అమలుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు దోహదపడనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:31 AM