ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఆస్తి కోసం తోబుట్టువులతో కొట్లాడి ఏం సాధిస్తారు?

ABN, Publish Date - Jun 18 , 2025 | 05:10 AM

ఉన్నత చదువులు చదివి, ఆర్థికంగా స్థిరపడిన వారు కూడా కొద్దిపాటి ఆస్తి కోసం తోబుట్టువులతో తగాదాలు పెట్టుకుని న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండడంపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

  • తల్లిదండ్రులు ఉన్నంత వరకు పిల్లలు ఆస్తుల్లో వాటా కోరకుండా చట్టం తెస్తే సరి

  • తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువులు చదివి, ఆర్థికంగా స్థిరపడిన వారు కూడా కొద్దిపాటి ఆస్తి కోసం తోబుట్టువులతో తగాదాలు పెట్టుకుని న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండడంపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొట్లాటలు పెట్టుకుని ఏం సాధిస్తారని, కోర్టుల చుట్టూ తిరిగి ఆస్తి గెలిచిన వారు కూడా సంతోషంగా ఉండలేరని వ్యాఖ్యానించింది. అసలు, తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తుల్లో వాటాలు కోరకుండా ఉండేలా చట్టం చేస్తే అందరికీ తెలిసి వస్తుందని అభిప్రాయపడింది. 264గజాల స్థలం విషయంలో ఓ కుటుంబంలో నెలకొన్న ఆస్తి తగాదాకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్‌ బి. విజయ్‌ ేసన్‌ రెడ్డి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఉన్నత చదువులు చదువుకుని.. మంచి ఉద్యోగం చేస్తూ.. ఆర్థికంగా బాగానే ఉన్నా.. స్వల్ప ఆస్తి కోసం సోదరులు, సోదరీమణులతో కొంతమంది కొట్లాడుతున్నారు.

ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ న్యాయస్థానాలను పెద్ద ఎత్తున ఆశ్రయిస్తున్నారు. అధికారం ఉండి ఉంటే ఆస్తి తగదాల్లో ఆస్తులన్నింటినీ న్యాయస్థానం కస్టడీలోకి తీసుకునేవారం. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి కోసం కొట్లాటలు పెట్టుకుని ఏం సాధిస్తారు? తాజా కేసులో 264 గజాలను ఆరుగురు(తల్లిదండ్రులతో కలిపి) పంచుకోవాలి. దాదాపు 44 గజాల స్థలం కోసం కొట్లాడుతున్నారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అధికారులు అనుమతి కూడా ఇవ్వరు. అసలు.. తల్లిదండ్రు లు బతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తుల్లో వాటాను కోరకుండా చట్టం చేస్తే తెలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో కొట్లాడి వెయ్యి గజాలు సాధించుకున్నా అది భవిష్యత్‌లో సంతృప్తినివ్వదు’ అని ధర్మాసనం పేర్కొంది.

Updated Date - Jun 18 , 2025 | 05:10 AM