ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ration Cards: మరో 2.89 లక్షల మందికి కొత్త రేషన్‌ కార్డులు

ABN, Publish Date - Jul 07 , 2025 | 02:24 AM

రాష్ట్ర ప్రభుత్వం మరో 2.89 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసింది. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.

  • ఈ నెల 14న పంపిణీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో 2.89 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసింది. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించేనాటికి రాష్ట్రవ్యాప్తంగా 89,95,282 రేషన్‌ కార్డులు అమల్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుంచి గత మే నెల 23వ తేదీ వరకు 2,03,156 కొత్త దరఖాస్తులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవికాకుండా అదనపు సభ్యుల నమోదుకు సంబంఽధించి 15,18,783 దరఖాస్తులను ఆమోదించింది. దీంతో అదనంగా 23,90,868 మంది సభ్యు లు వినియోగదారుల జాబితాలో చేరారు.

అనంతరం మే 24వ తేదీ నుంచి ఇప్పటివరకు అందిన దరఖాస్తులను పరిశీలించి 2,89,239 కార్డులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో అదనంగా మరో 9,10,349 మంది వినియోగదారుల జాబితాలో చేరారు. ఈ వ్యవధిలో 2,65,142 దరఖాస్తులు అదనపు సభ్యుల నమోదుకు అనుమతించారు. తద్వారా 4,17,160 మంది కొత్తగా వినియోగదారుల జాబితాలో చేరారు. తాజాగా ఆమోదం పొందిన 2.89 లక్షల కుటుంబాలకు ఈ నెల 14వ తేదీ నుంచి రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా 4,92,395 కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసినట్లు అవుతుంది. కాగా పాత, కొత్త కార్డులు కలిపి రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్య 94,72,422కు చేరుతుంది. లబ్ధిదారుల సంఖ్య 3,14,56,690కు పెరుగుతుంది.

Updated Date - Jul 07 , 2025 | 02:24 AM