ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

New Posts: అర్థ గణాంక శాఖలో 166 పోస్టుల మంజూరు

ABN, Publish Date - Jul 04 , 2025 | 05:50 AM

కాలానుగుణ మార్పులు, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో అర్థగణాంక శాఖలో అక్కర్లేని 38 పోస్టులను రద్దుచేసి వాటి స్థానంలో 166 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

  • అక్కర్లేని 38 పోస్టుల రద్దు.. కొత్తపోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే

హైదరాబాద్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): కాలానుగుణ మార్పులు, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో అర్థగణాంక శాఖలో అక్కర్లేని 38 పోస్టులను రద్దుచేసి వాటి స్థానంలో 166 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 12 ప్రధాన ప్రణాళికాధికారి, 12 సహాయ సంచాలకులు, 46 గణాంకాధికారులు, 64ఉప గణాంకాధికారులు, 5 సూపరింటె ండెంట్‌, 23 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి.

ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా గురువారం జీవో జారీ చేశారు. 8 సహాయ గణాంకాధికారులు, 15 టైపిస్ట్‌, 8 ఎల్‌డీ స్టెనో, 7 డ్రైవర్‌ పోస్టులు రద్దు చేసిన వాటిలో ఉన్నాయి. కొత్తగా మంజూరు చేసిన పోస్టులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

Updated Date - Jul 04 , 2025 | 05:50 AM