ఇన్‌చార్జి మంత్రుల జిల్లాలు మార్పు
ABN, Publish Date - Jun 13 , 2025 | 03:35 AM
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఇన్‌చార్జి మంత్రుల బాధ్యతల్లో మార్పులు చేర్పులు చేసింది. కొత్త మంత్రులకు జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త మంత్రులకు బాధ్యతలు
కొండా సురేఖ, ఉత్తమ్, కోమటిరెడ్డిల ఇన్‌చార్జి బాధ్యతలు తొలగింపు
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఇన్‌చార్జి మంత్రుల బాధ్యతల్లో మార్పులు చేర్పులు చేసింది. కొత్త మంత్రులకు జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి మెదక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు నల్గొండ, వాకిటి శ్రీహరికి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి బాధ్యతను ప్రభుత్వం కేటాయించింది. పాత మంత్రుల్లో కొందరికి కేటాయించిన జిల్లాలను మార్చగా.. ముగ్గురిని ఆ బాధ్యతల నుంచి తొలగించింది.
ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెదక్ జిల్లా ఇన్‌చార్జ్జిగా ఉన్న కొండా సురేఖ, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్జిగా ఉన్న ఉత్తమ్‌లను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు తాజా మార్పుల్లో కరీంనగర్ జిల్లాను, నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జ్జిగా ఉన్న జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ జిల్లాను కేటాయించింది. మొత్తంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్‌చార్జులుగా పదిమంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది.
జిల్లా ఇన్‌చార్జి మంత్రులు వీరే
ఇన్‌చార్జి మంత్రులు జిల్లాలు
దామోదర రాజనర్సింహ మహబూబ్‌నగర్
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రంగారెడ్డి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్
పొన్నం ప్రభాకర్ హైదరాబాద్
డి.అనసూయ (సీతక్క) నిజామాబాద్
తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్
జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్
గడ్డం వివేక్ వెంకటస్వామి మెదక్
అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నల్గొండ
వాకిటి శ్రీహరి ఖమ్మం
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News
Updated Date - Jun 13 , 2025 | 03:35 AM