ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yogita Rana: టీచర్లు నూతన లక్ష్యాలతో పని చేయాలి

ABN, Publish Date - May 04 , 2025 | 04:02 AM

కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు నూతన లక్ష్యాలతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి విద్యలో ప్రగతి సాధించేలా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కోరారు.

  • ప్రతి విద్యార్థి ప్రగతి సాధించేలా చూడాలి

  • విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు నూతన లక్ష్యాలతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి విద్యలో ప్రగతి సాధించేలా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కోరారు. బోధించే ప్రతి అంశం విద్యార్థులందరికీ అర్థమయ్యేలా ఉండాలని కోరారు. రాష్ట్రస్థాయి విద్యాశాఖాధికారులు, జిల్లాల విద్యాశాఖాధికారులకు మూడు రోజుల శిక్షణ శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని జిల్లా విద్యాశాఖాధికారులకు సూచించారు.


ఈ సమావేశానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోషల్‌ మీడియా ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా ఉంటోందని, విద్యార్థులు వారికి తెలియకుండానే సైబర్‌ నేరాలు, లైంగిక వే ధింపులకు గురవుతున్నారన్నారు. బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన విషయాలు, ఐటీ చట్టం గురించి ప్రతి ఉపాధ్యాయులు బోధించాలని కోరారు. సమావేశంలో పాఠశాల విద్య సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి, జిల్లాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 05:07 AM