Khammam: ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్
ABN, Publish Date - May 27 , 2025 | 04:29 AM
గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ జెక్కి అరుణ ఏసీబీకి చిక్కారు.
గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు రూ.50 వేలు డిమాండ్
చేసిన అధికారి.. 30 వేలకు ఒప్పందం
డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం
డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత
ఖమ్మం, మే 26 (ఆంధ్రజ్యోతి): గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ జెక్కి అరుణ ఏసీబీకి చిక్కారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ సర్వేనంబరులో శ్రీనివాస్ అనే వ్యక్తి తన పేరిట ఉన్న 2,700 గజాల స్థలాన్ని తన కుమారుడి పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు చలానా తీశారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో సబ్ రిజిస్ట్రార్ అరుణ వారిని రూ.50 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం దరఖాస్తుదారుడు సబ్‌రిజిస్ట్రార్‌తో బేరమాడి రూ.30వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ నగదును డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్ ద్వారా తనకు అందజేయాలని ఆమె చెప్పారు. ఈ క్రమంలో సోమవారం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ రైటర్ ద్వారా నగదు తీసుకుంటుండగా ఇద్దరినీ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..
Updated Date - May 27 , 2025 | 04:29 AM