ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గురునానక్‌ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

ABN, Publish Date - May 11 , 2025 | 05:23 AM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది.

ఇబ్రహీంపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కందనవెల్లికి చెందిన భావన(20) గరునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. క్యాంపస్‌ హాస్టల్‌లోనే ఉంటున్న ఆమె శనివారం జరిగే కాలేజీ వార్షికోత్సవంలో అవార్డు తీసుకోవాల్సి ఉంది.


అయితే, శనివారం ఉదయం గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు భావన ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. భావన ఆత్మహత్యకు గురునానక్‌ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఏబీవీపీ, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు వేర్వేరుగా ఆందోళన చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు.

Updated Date - May 11 , 2025 | 05:23 AM