ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hanamkonda Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయ విహారం

ABN, Publish Date - May 01 , 2025 | 05:59 AM

హనుమకొండలోని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో విజయం సాధించారు. 580కి పైగా మార్కులు సాధించిన 23 మంది విద్యార్థులు సంచలనం సృష్టించారు.

హనుమకొండ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. 600 మార్కులకు జరిగిన పరీక్షల్లో ఎస్‌ఆర్‌ విద్యార్థులు సక్కర శివప్రియ 586, డి.దీక్షితారెడ్డి 586, ఎం.మనస్విని 585, మణివర్ధన్‌ 584, శివచరణ్‌ 584, వి.హాసిని 584 మార్కులు సాధించారు. మొత్తం 23 మంది విద్యార్థులు 580పైగా మార్కులు సాధించి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ.వరదారెడ్డి మాట్లాడుతూ ఒత్తిడి లేని వాతావరణంలో, క్రమశిక్షణ, సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి వరదారెడ్డి, విద్యాసంస్థల డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Updated Date - May 01 , 2025 | 06:02 AM