ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Saraswati Pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు

ABN, Publish Date - May 27 , 2025 | 04:15 AM

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు సాగిన సరస్వతి పుష్కరాలు సోమవారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.

  • చివరి రోజు 2.25 లక్షల మంది రాక

  • మొత్తంగా 15.9 లక్షల మంది హాజరు

  • పొరపాట్లు జరిగి ఉంటే క్షమించాలి

  • గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం.. వేడుకల ముగింపులో మంత్రి శ్రీధర్‌బాబు

భూపాలపల్లి/కాళేశ్వరం/వేములవాడ కల్చరల్‌/బాసర, మే 26 (ఆంరఽధజ్యోతి): భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు సాగిన సరస్వతి పుష్కరాలు సోమవారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 15.9 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. చివరి మూడు రోజుల్లోనే సుమారు 8 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. చివరి రోజైన సోమవారం 2.25 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ వేడుకలకు 6 లక్షల నుంచి 8 లక్షల మంది వస్తారని దేవాదాయ శాఖ అంచనా వేయగా ఎవరూ ఊహించని రీతిలో 16 లక్షల మంది వచ్చారు. సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లలో చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే భక్తులు పెద్ద మనస్సుతో క్షమించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. సోమవారం సరస్వతి పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాబోయే గోదావరి పుష్కరాలను రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.


వేములవాడలో రద్దీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. సుమారు 80 వేల నుంచి 90 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు సమాచారం. ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్‌లో నాలుగు గంటల పాటు భక్తులు నిరీక్షించారు.


బాసర వద్ద గోదావరిలో ఇద్దరి మృతి

నిర్మల్‌ జిల్లా బాసరలోని గోదావరి నదిలో సోమవారం ఇద్దరు మృతి చెందారు. మహారాష్ట్రలోని పర్భణీ జిల్లా టాక్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం బాసర వచ్చింది. ఈ క్రమంలో వారంతా స్నానం చేద్దామని గోదావరిలోకి దిగగా.. బాలుడు కుల్‌దీప్‌ బాలాసాహెబ్‌ దేశ్‌ముఖ్‌(12) నీట మునిగి మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం కమలాపూర్‌ గ్రామానికి చెందిన బొల్ల మల్లరాజు(40) బాసర గోదావరిలో స్నానానికి వెళ్లి కాలు జారి నీట మునిగి మృతి చెందాడు.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 04:15 AM