ESI Hospital: ఈఎస్ఐలో ఆటోమేటెడ్ టోకెన్!
ABN, Publish Date - May 15 , 2025 | 03:34 AM
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో త్వరలోనే ఆటోమేటెడ్ టోకెన్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆస్పత్రి డెవల్‌పమెంట్ మెంబర్, మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ తెలిపారు.
త్వరలో ప్రవేశపెడతామన్న ఆస్పత్రి కమిటీ సభ్యుడు
‘ఆంధ్రజ్యోతి’ ఫొటో వార్తకు స్పందన
హైదరాబాద్ సిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో త్వరలోనే ఆటోమేటెడ్ టోకెన్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆస్పత్రి డెవల్‌పమెంట్ మెంబర్, మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ తెలిపారు. ఈఎ్‌సఐ ఆస్పత్రిలో ఓపీ కోసం చిరుద్యోగులతో తీవ్ర రద్దీ నెలకొంటున్న నేపథ్యంలో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ‘ఈఎ్‌సఐ ఓపీ కౌంటర్.. జనసముద్రం’ అనే శీర్షికతో ఫొటో వార్తను ప్రచురించిన సంగతి తెలిసిందే.. దీనిపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందిస్తూ సనత్‌నగర్ ఈఎ్‌సఐని సందర్శించాల్సిందిగా ఆస్పత్రి డెవల్‌పమెంట్ మెంబర్ మనోహర్‌ను ఆదేశించారు.
దీంతో బుధవారం మనోహర్ ఈఎ్‌సఐ ఆస్పత్రికి చేరుకొని డీన్ శిరీష్ కుమార్‌తో కలిసి మాట్లాడారు. అనంతరం ఆయనతో పాటు ఆస్పత్రి ఓపీ, వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు త్వరిత సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి అధికారులకు మనోహర్ సూచించారు.
Updated Date - May 15 , 2025 | 03:34 AM