ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raja Singh: చెవులు లేని వాళ్లని అడిగితే ఏం లాభం?

ABN, Publish Date - Jun 12 , 2025 | 03:52 AM

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర నుంచి కావాల్సిన నిధుల అంశంలో బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • ప్రధాని మోదీని కలవండి.. పనులు అవుతాయి

  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీజేపీ నేత రాజాసింగ్‌ సూచన

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధికి కేంద్ర నుంచి కావాల్సిన నిధుల అంశంలో బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెవులు లేని వాళ్లని అడిగితే ఏం లాభం? చెవులు ఉన్న వాళ్లని అడిగితేనే ఫలితం ఉంటుందని.. సీఎం రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు. ప్రధాని మోదీ మంచి నాయకుడని, సీఎం రేవంత్‌ ప్రధానిని కలిస్తే పనులు జరుగుతాయని సూచించారు. అలాగే, సీఎం రేవంత్‌నుద్దేశించి రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ రాష్ట్రంలో నోరు మూసుకుని ఉంటారని, కానీ ఢిల్లీకి వెళ్లిన తర్వాత నోరు ఎత్తుతారని, ఆ సీక్రెట్‌ ఏంటో చెప్పాలని కోరారు. ’’రేవంత్‌రెడ్డి గారు మొన్న మీరు కిషన్‌రెడ్డి ముందే ఉన్నారు కదా.. అప్పుడు కిషన్‌ రెడ్డిని ఎందుకు అడగలేదు.

ఈ రోజు ఢిల్లీలో మీరు ఎందుకని బీజేపీ, కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు?’’ అని రాజాసింగ్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న రేవంత్‌ ప్రధాని మోదీని కలిసి విషయాన్ని ఆయన ముందు ఉంచాలని సూచించారు. అలాగే, 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ అభివృద్థికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయనే దానిపై ఓ జాబితాను తీసుకురావాలని ముఖ్యమంత్రిని కోరారు.

Updated Date - Jun 12 , 2025 | 03:52 AM