CM Revanth Reddy: నా నాయకుడి మాటలు.. పోరాటానికి స్ఫూర్తినిచ్చాయి
ABN, Publish Date - Jul 26 , 2025 | 04:04 AM
తెలంగాణలో కులగణన నిర్వహించడంపై తమను అభినందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడిన మాటలు తనకు సామాజికన్యాయ లక్ష్యాలను సాధించేదాకా పోరాడే స్ఫూర్తినిచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
కులగణనపై రాహుల్ వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ పోస్ట్
నేడు ‘ఇక్‌ఫై’ కార్యక్రమానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కులగణన నిర్వహించడంపై తమను అభినందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడిన మాటలు తనకు సామాజికన్యాయ లక్ష్యాలను సాధించేదాకా పోరాడే స్ఫూర్తినిచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన, దానిని విజయవంతంగా పూర్తిచేయడం పట్ల సీఎం రేవంత్‌ను గురువారం ఢిల్లీలో రాహుల్‌గాంధీ అభినందించిన విషయం తెలిసిందే. ‘‘తెలంగాణలో కులసర్వే నిర్వహించాలని నేను మొదట రేవంత్‌ను అడిగినప్పుడు.. నాకే కొన్ని సందేహాలున్నాయి. కానీ, నా అంచనాలను అధిగమించి చేశారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదొక మైలురాయి’’ అని రాహుల్ అన్నారు.
ఈ వాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. ‘‘నా నాయకుడు చెప్పిన ఈ మాటలు సామాజికన్యాయ లక్ష్యాలను సాధించే వరకు ఎదురయ్యే అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడే స్ఫూర్తినిచ్చాయి’’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఇక్‌ఫై) ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ తరఫున మోహన్ గురుస్వామి అనే పాలసీ అడ్వైజర్‌కు ‘ఎస్.జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు’ను అందించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 04:04 AM