Share News

GHMC Officers: నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:43 PM

రహదారిని అక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులపై స్థలం యజమాని మండిపడ్డారు. అంతేకాకుండా.. కత్తి తీసి వారిని బెదిరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది.

GHMC Officers: నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా

హైదరాబాద్, జులై 25: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లోని టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నా.. మహానగరంలో అక్రమ నిర్మాణాలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. వీటిపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగి.. అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతూ చర్యలు చేపడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఒక వ్యక్తి రహదారిని అక్రమించి.. ప్రహారి గోడ నిర్మిస్తున్నట్లు సర్కిల్ 18లోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు ఫిర్యాదు అందింది.


దీంతో సదర సర్కిల్‌ అధికారులు.. ఆ ప్రాంతానికి చేరుకుని.. ఆ స్థలం కొలతలు తీసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో వారిని స్థలం యజమాని అడ్డుకున్నారు. అంతేకాదు.. టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఆ వ్యక్తి వీరంగం చేశాడు. కారులో నుంచి కత్తీ తీసి నరికేస్తానంటూ సిబ్బందిని బెదిరించాడు. దీంతో వారు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో స్థలం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులను కత్తితో బెదిరిస్తున్న వ్యక్తి తాలుక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


మరోవైపు రోజురోజుకు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుంది. దీంతో అక్రమ నిర్మాణాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అందుకు జీహెచ్ఎంసీ అధికారులు సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణదారులకు ఊతం ఇచ్చినట్లుగా ఉంటుంది. ఆ క్రమంలో వారు రెచ్చిపోతున్నారు. ఇంకోవైపు మూసీ నది పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోంది. అదే రీతిలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సైతం వ్యవహరించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డ్రోన్ మిసైల్ ప్రయోగంపై సీఎం చంద్రబాబు హర్షాతిరేకాలు

డ్రోన్ ద్వారా మిసైల్‌ను ప్రయోగించిన డీఆర్‌డీఓ

For Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:29 PM