High Court: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు నిరాశ
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:33 AM
కోర్సుల విలీనం, సీట్ల పెంపుపై 14 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో నిరాశ ఎదురయింది.
సీట్ల పెంపునకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కోర్సుల విలీనం, సీట్ల పెంపుపై 14 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో నిరాశ ఎదురయింది. బీటెక్-సీఎ్‌సఈ ఇతర విభాగాల్లో సీట్లు పెంచుకోవడానికి, కోర్సుల విలీనానికి ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ అంగీకరించినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడం లేదని పేర్కొంటూ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, సీఎంఆర్, ఎంఎల్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ తదితర కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌లను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ ఏడాది మే 2న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయా కాలేజీలు డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది.
కాలేజీల తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. ఇతర ఇంజినీరింగ్ కాలేజీలకు సీట్ల పెంపునకు అవకాశం ఇచ్చి.. కేవలం రాజకీయ కక్షతో తమ కాలేజీలకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్ కాలేజీలు ఉన్న ప్రాంతంలో ఇప్పటికే చాలా కాలేజీలు ఉన్నాయని.. అదే లొకాలిటీలో మళ్లీ సీట్ల పెంపు కోరడం సరికాదని తెలిపారు. ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు, సీట్లు పెరిగిపోకుండా ప్రభుత్వ నియంత్రణ కూడా ఉండాలని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకం కాదని పేర్కొంది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ ఇంజనీరింగ్ కాలేజీల పిటిషన్‌లను కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 04 , 2025 | 03:33 AM