Hyderabad: 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా బంద్..
ABN, Publish Date - Jun 25 , 2025 | 07:12 AM
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ కమలాపురికాలనీ, సత్యసాయినిగమాగమం ఏరియాలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ కమలాపురికాలనీ, సత్యసాయినిగమాగమం, కమలాపురి కాలనీ ఫేజ్-1 నుంచి 3 వరకు, తన్వీర్ ఆస్పత్రి మోడల్ హౌస్, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ మారుతీనగర్, పంజాగుట్ట, సాయిబాబా టెంపుల్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ మహాత్మానగర్, కార్మికనగర్, విద్యుత్ టవర్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ పీలిదర్గా, బోరబండ, దివ్యశక్తి అపార్ట్‌మెంట్, ఆనంద్‌బాగ్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
మల్కాజిగిరి: ఆనంద్‌బాగ్ విద్యుత్ సబ్‌డివిజన్ పరిధిలోని 11 కేవీ కృపాఆనంద్ అపార్టుమెంట్ ఫీడర్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 1 వరకు వెస్ట్ ఆనంద్‌బాగ్, ఏడీఆర్ ఆస్పత్రి, కృపా అపార్టుమెంట్, 11 కేవీ సంతోషిమానగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు వినాయక్‌నగర్ బ్లాక్-1, బ్లాక్-2, సంతోషిమాతనగర్, పూలపల్లి బాలయ్యనగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని ఏఈ శ్రీనివాస్ కోరారు.
రామంతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో..
రామంతాపూర్: రామంతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని కామాక్షిపురం, లక్ష్మీ నగర్ ఫీడర్‌లలో ఈ నెల 25న బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని సంబంధిత ట్రాన్స్ కో ఏఈ కూతాడి లావణ్య తెలిపారు. కామాక్షిపురం ఫీడర్‌లోని వివేక్‌నగర్ కమ్యూనిటీ హాల్, కామాక్షిపురం, వాసవీ నగర్, రాంరెడ్డి నగర్‌లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అదే విధంగా లక్ష్మీ నగర్ ఫీడర్‌లోని సాయి చిత్రనగర్, లక్ష్మీ నగర్, మధుర బార్, మెయిన్ రోడ్డు, ఎన్‌ఎండీసీ, ల్యాండ్ మార్క్ హోటల్, గోఖలే నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆమె వెల్లడించారు.
మౌలాలి సబ్‌స్టేషన్ పరిధిలో..
కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఉప్పరిగూడ, ఎఫ్‌బీపీ ఫీడర్ల పరిధిలోని ఉప్పరిగూడ, సంజయ్‌గాంధీనగర్, పార్దన్‌బస్తీ, షిరిడీనగర్, రాజానగర్, సిల్వర్ స్ర్పింగ్ అపార్ట్‌మెంట్, రైల్వే హెచ్‌టీ సర్వీసెస్ పరిసర ప్రాంతాలలో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, గాయత్రీనగర్, మీర్‌పేట్ ఫీడర్ల పరిధిలోని ఓల్డ్ మౌలాలి, సాదుల్లానగర్, చందాబాగ్, హ్యాపీ హోమ్స్, అండాళ్‌నగర్, ఎస్పీనగర్, పటేల్‌నగర్, గ్రీన్‌హిల్స్ కాలనీ, గాయత్రీనగర్, మీర్‌పేట్ తిరుమలనగర్, న్యూ శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు మౌలాలి సబ్ స్టేషన్ ఏఈ వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు
Read Latest Telangana News and National News
Updated Date - Jun 25 , 2025 | 07:12 AM