ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం

ABN, Publish Date - May 05 , 2025 | 03:59 AM

టీజీఎస్‌‌ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ బస్టాండ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడారు.

  • నేడు, రేపు.. ఎప్పుడొచ్చినా చర్చిస్తాం: పొన్నం

హుస్నాబాద్‌ రూరల్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): టీజీఎస్‌‌ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ బస్టాండ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడారు. ప్రయాణానికి సంబంధించిన అంశాలపై మంత్రి కాసేపు ముచ్చటించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రజాపాలనలో కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించడానికి ఈ నెల 5, 6 తేదీల్లో తాను హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటానని చెప్పారు. గత పదేళ్లలో కార్మికుల సమ్మెతో అనేక మంది చనిపోయినా పట్టించుకోలేదన్నారు. ఒక్క ఆర్టీసీ బస్సు కొనుగోలు చేయకుండా, ఒక్క నియామకం చేపట్టకుండా గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రజాపాలన వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రవాణా వ్యవస్థ బాగుండాలని కొత్తబస్సులు కొనుగోలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్టీసీలో నియామకాలు చేపట్టామని ఆయన చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 03:59 AM